(Local) Mon, 27 Jan, 2020

ముచ్చటగా మూడోసారి తలైవా తో....

October 12, 2019,   11:54 AM IST
Share on:
ముచ్చటగా మూడోసారి తలైవా తో....

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగ...ఆ తర్వాత  ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో  సూపర్ స్టార్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా కనిపించబోతోంది. ఇటీవలే చిత్ర యూనిట్ ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి గుమ్మడికాయ కూడా కొట్టేసారు. ఈ ‘దర్బార్’ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇక తాజాగా తలైవ 168వ చిత్రంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. 
తెలుగులో సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారి...‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలు చేసిన శివ తమిళ్‌లో కార్తితో ‘సిరుత్తై’ (విక్రమార్కుడు) రీమేక్ చేశాడు. ‘అల్టిమేట్ స్టార్’ అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి వరుస హిట్స్‌ సినిమాలను  తెరకెక్కించిన శివ ర‌జనీకాంత్ 168వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారంనాడు సన్ పిక్చర్స్‌ ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్‌గా ప్రకటించింది. ‘యందిరిన్‌ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్‌ సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మూవీ తలైవ ఇమేజ్‌కు తగ్గట్టు ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనట్టు సమాచారం.  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మొద‌ట్లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. మొత్తానికి వ‌చ్చే ఏడాది ర‌జ‌నీకాంత్ రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాడు. 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.