(Local) Mon, 16 Sep, 2019

కండలవీరుడికి స్వాగతం పలికిన మెగాహీరో.....

September 11, 2019,   3:23 PM IST
Views: 28
Share on:
కండలవీరుడికి స్వాగతం పలికిన మెగాహీరో.....

2010లో అభినవ్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు హీరోగా తెరకెక్కిన చిత్రం దబాంగ్. సల్మాన్ ఖాన్ హీరోగా, సోనాక్షి సిన్హా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఈ చిత్రానికి సిరీస్‌లో గా 2012లో దబాంగ్ 2 గా మళ్ళీ మురిపించిన సల్లూ భాయ్. తాజాగా మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్3 సిరీస్‌లో తెరమీద కనిపించబోతున్నాడు. ఈసారి కూడా మళ్ళీ ఇదే జంట వెండితెరపై అలరించబోతున్నారు. ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. స‌ల్మాన్‌కి స‌న్నిహితుడైన రామ్ చ‌ర‌ణ్ త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రెండ్‌కి స్వాగతం ప‌లుకుతూ ట్వీట్ చేశాడు. హండ్రెడ్ డేస్ టూ ద‌బంగ్ 3 అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేసి చిత్ర తెలుగు వ‌ర్షెన్ మోష‌న్ పోస్ట‌ర్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా షేర్ చేశాడు. వీడియోలో స‌ల్మాన్ .. ఆట‌కైన‌, వేట‌కైన రెడీ అని చెప్పే డైలాగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. కిచ్చా సుదీప్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. 
 

సంబంధిత వర్గం
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....
సింధూకు కొణిదెల ఉపాసన గిప్ట్......
సింధూకు కొణిదెల ఉపాసన గిప్ట్......

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.