(Local) Fri, 06 Dec, 2019

100 మిలియన్ల వ్యూస్ తో 'దిమాక్ ఖరాబ్'...

November 16, 2019,   3:35 PM IST
Share on:
100 మిలియన్ల వ్యూస్ తో 'దిమాక్ ఖరాబ్'...

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టెంపర్ తర్వాత సరియిన హిట్ అందుకున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే వాటిలో ‘దిమాక్ ఖరాబ్’ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్, యువతను మరియు మాస్ ఆడియన్స్ ను మరింతగా ఊపేసిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సాంగ్ నేడు ఒక అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది రిలీజ్ అయిన సాంగ్స్ లో ఈ ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ లిరికల్ గా అలానే వీడియో సాంగ్ వ్యూస్ పరంగా, మొత్తం కలిపి 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ దక్కించుకుని, ఇప్పటికీ యూట్యూబ్ లో తిరుగులేకుండా దూసుకుపోతోంది. రామ్ ఫ్యాన్స్ ఈ విషయమై ఎంతో ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే….!!
 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...
‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.