(Local) Sun, 17 Nov, 2019

మందిరా బేడీ స్థానంలో రమ్యకృష్ణ....

November 07, 2019,   7:10 PM IST
Share on:
మందిరా బేడీ స్థానంలో రమ్యకృష్ణ....

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న మూవీ రొమాంటిక్. ఈ సినిమాని పూరి శిష్యుడు అనీల్ పాడూరి డైరెక్ట్ చేస్తుండగా ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీని పూరి జగన్నాధ్ ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ తో సెగలు పుట్టించిన ఈ రొమాంటిక్ చిత్రంలో లేడి సూపర్ స్టార్ రమ్యకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా జాయిన్ అయిన రమ్యకృష్ణ, సినిమాకి మెయిన్ ఎస్సట్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్న పాత్రలో ఇంతకు ముందు మందిరా బేడీ నటించిందట. ఆమెతో చేసిన సీన్స్ లో ఇంపాక్ట్ లేకపోవడం, మందిరా బేడీ కన్నా తెలుగులో రమ్యకృష్ణ రీచబిలిటీ ఎక్కువ కావడంతో… పూరి రమ్యకృష్ణ సైడ్ షిఫ్ట్ అయ్యాడు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన రొమాంటిక్ షూటింగ్ డిలే అవ్వడానికి కారణం కూడా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి రమ్యకృష్ణ ప్రెజెన్స్ ఆకాష్ పూరికి ఎలాంటి హిట్ ఇస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

సంబంధిత వర్గం
జలక్రీడల్లో శ్రీయా అందాలు…
జలక్రీడల్లో శ్రీయా అందాలు…
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.