(Local) Wed, 23 Oct, 2019

మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక..ఎలానో తెలుసా

June 16, 2019,   5:26 PM IST
Share on:
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక..ఎలానో తెలుసా

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున మొదలుకానుంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. తొలిసారి ఆమె మహేష్‌తో కలిసి నటించనుండడం విశేషం. అయితే నిజానికి ముందుగా రష్మిక ఈ ప్రాజెక్ట్‌లో లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి అడిగినప్పుడు ఆమె డేట్స్ ఖాళీ లేవు. నితిన్ చిత్రం ‘భీష్మ’తో పాటు తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వడంతో ఆమె మహేష్ చిత్రానికి ఓకే చెప్పలేకపోయింది.

కానీ తర్వాత శివ కార్తికేయన్ సినిమాలో తనది కేవలం గ్లామర్ పాత్ర అని తెలియడంతో ఈ యంగ్ బ్యూటీ బయటికు వచ్చేసింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో ఇంకా ఎవరినీ హీరోయిన్‌గా తీసుకోకపోవడంతో వెంటనే రష్మిక ఈ చిత్రానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఆ విధంగా టాలీవుడ్‌కు పరిచయమైన రెండేళ్లకే సూపర్‌స్టార్ మహేష్ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఎలాగూ హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. ‘పటాస్’లో రాశిఖన్నా, ‘రాజా ది గ్రేట్’లో మెహరీన్, ‘ఎఫ్2’లో తమన్నా… ఇలా హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లో సైతం అలాంటి స్కోప్ దక్కడంతో ఆలస్యం చేయకుండా రష్మిక ఓకే చెప్పిందట.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.