(Local) Mon, 21 Oct, 2019

రేణూ దేశాయ్‌కు డెంగు...

September 16, 2019,   2:56 PM IST
Share on:
రేణూ దేశాయ్‌కు డెంగు...

పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడమే మూలాన దోమల జాతి అభివృద్ధి చెందుతుందని తెలిసిన సంగతే. తాజాగా హైదరాబాద్ సిటీలో ఈ దోమల కారణంగా వైరల్ ఫీవర్ డెంగు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అయితే ఈ డెంగ్యూ వ్యాధి బారిన సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా గురవుతున్నారు. తాజాగా ఈ డెంగ్యూ వ్యాధి నుండి కోలుకుంటున్న నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసారు. దోమల నుంచి జాగ్రత్తగా ఉండాలని..తాను డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. అంతేకాక జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సినిమాల నుంచి రెస్టు తీసుకున్న ఈమె..బుల్లితెరపై ప్రసారమౌతున్న రియాల్టీ షోలు..ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. కాగా ఈ డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సిన వచ్చింది అని ఆ సమయంలో ఇలా ఉన్నానంటూ ..ఓ ఫొటో కూడా పోస్టు చేశారు. ఢీ ఛాంపియన్ షిప్ షోలో రేణూ పాల్గొంటాున్నారు. కొన్ని గంటల పాటు షూటింగ్‌కు నో చెప్పాలేకపోయినట్లు తెలిపారు. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుస్తుల విషయంలో పలు జాగ్రత్తలు తెలిపారు. పొడవైన దుస్తులనే వాడుకొండి అని తెలిపారు. 
 

సంబంధిత వర్గం
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మూడు పిటిషన్లు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మూడు పిటిషన్లు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.