(Local) Fri, 19 Jul, 2019

రేణూ దేశాయ్‌ రెండో పెళ్లి ఆగిపోయింది - పుకార్ల‌పై రేణూ క్లారిటీ

June 14, 2019,   8:15 PM IST
Share on:

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ కొద్ది రోజుల క్రితం రెండో వివాహం చేసుకోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే రేణూ ఇప్ప‌టికే ఓ వ్య‌క్తితో నిశ్చితార్ధం జ‌రుపుకోగా, ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. నిశ్చితార్ధం జ‌రిగి చాలా రోజులే అయిన పెళ్ళి గురించి ఎలాంటి వార్త‌లు రాక‌పోయే స‌రికి నెటిజ‌న్స్ రేణూ రెండో పెళ్లి ఆగిపోయిందంటూ ప్రచారం చేశారు. ఈ నేప‌థ్యంలో రేణూ త‌న సోషల్ మీడియా ద్వారా పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చింది. త‌న‌కి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని షేర్ చేస్తూ.. ఇవి నాకు కాబోయే భ‌ర్త తీసాడని తెలుపుతూ, “ఫియాన్సీ గారికి థాంక్స్” అంటూ కామెంట్ కూడా చేసింది. ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమా స్క్రిప్ట్ ప‌నుల‌లో బిజీగా ఉన్న రేణూ అవకాశం ఇస్తే బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని తెలిపింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.