(Local) Mon, 20 Sep, 2021

ఓ నా బుజ్జి జొన్నా నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్...వర్మ

November 01, 2019,   6:57 PM IST
Share on:
ఓ నా బుజ్జి  జొన్నా నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్ ...

వీడి నోట్లో నోరు పెట్టకూడదు....అనే నానుడి మనం ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం. అయితే ఈ నానుడి రామ్ గోపాల్ వర్మ విషయంలో చాల బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వర్మ మీద ఏవరు కామెంట్ చేసిన ఈ వివాదాల దర్శకుడు వారికీ కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో ఏకిపారేసిన సందర్భాలు చాల ఉన్నాయి. తాజాగా వివాదాల దర్శకుడు వర్మ సినీ రచయితపై సంచలన కామెంట్స్ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వర్మ రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడుతున్నారంటూ జొన్నవిత్తుల వర్మను ఏకిపారేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంపై జొన్నవిత్తుల స్పందిస్తూ రెండు రోజుల క్రితం వర్మపై  ఓ రేంజులో రెచ్చిపోయారు. ‘నాకు జొన్నవిత్తుల చౌదరి అని బిరుదు ఇచ్చిన వర్మకు పప్పు వర్మ అని బిరుదు ఇస్తున్నా స్వీకరించు’ అని ఆయన సవాల్ విసిరారు. ఈమధ్య విడుదల అయిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రైలర్ విషయంలో ఆయనను స్పందించాల్సిందిగా ఓ ఛానల్ ఫోన్ లైన్‌లో మాట్లాడింది. అప్పుడు వర్మ ఫోన్ చూస్తూ తన మాటలు వినలేదని చెప్పి తనను అవమానించారని జొన్నవిత్తుల ఆరోపించారు. రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ పైన తాను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానని ప్రకటించారు. ‘వర్మ ఓ బతికున్న శవం. ఇలాంటి బరితెగించినవాడు సమాజంలో ఉండకూడదు. ఇతని దిక్కుమాలిన ఆలోచనల వలన సొసైటీకి కలిగే దుష్పరిణామాలను తొలగించే ప్రయత్నమే ఈ ‘పప్పువర్మ’ బయోపిక్’ అని జొన్నవిత్తుల మండిపడ్డారు.


ఇదిలావుండగా జొన్నవిత్తుల వీడియోపై వర్మ ట్విటర్‌లో స్పందించాడు. ‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్‌హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. మరి దీనిపై జొన్నవిత్తుల ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వర్గం
వర్మకు హైకోర్టు షాక్....
వర్మకు హైకోర్టు షాక్....
వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ
వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.