(Local) Wed, 16 Oct, 2019

'ఓపెనర్ కి ఆయుధపూజా' సీనియర్ హీరో....నెటిజన్లు ఫైర్

October 09, 2019,   7:53 PM IST
Share on:
'ఓపెనర్ కి ఆయుధపూజా' సీనియర్ హీరో....నెటిజన్లు ఫైర ...

సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఆయుధం లాంటిది...సోషల్ మీడియా అనేది వెలుగులోకి వచ్చాక ప్రతి సెలెబ్రిటీస్ సంబందించిన విషయాలుఅందరికి తెలుస్తూనే ఉంటాయి...ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీమ్స్, ట్రోలింగ్‌ల పేరుతో తాట తీసేస్తారు నెటిజన్స్. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి నెటిజన్స్‌కి కోపం తెప్పించారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం 11 నెలల పాటు అమెరికాలో ఉన్న రిషి కపూర్.. ఇటీవలే ముంబై వచ్చారు. దసరా సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

 దసరా పండుగ సందర్భంగా విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ వాహనాలకు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులకు ఆయుధపూజలు చేస్తుంటారని తెలిసిందే. అయితే తాజాగా ఈ విజయదశమి రోజున రిషి కపూర్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. ‘ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. శాస్త్ర పూజ’ అంటూ ఓపెనర్‌కి పసుపు కుంకుమ రాసి ఉన్న పిక్ పోస్ట్ చేసి, ‘దీన్ని బాధ్యతగా వాడాలి’ అంటూ సలహా ఇచ్చారు...దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో తగులుకున్నారు..  సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి?.. ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?.. అంటూ రిషి కపూర్‌ని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ లేదా కామెంట్ చెయ్యడం.. ఎవరు ఏమన్నా కేర్ చెయ్యకపోవడం ఆయన స్టైల్ కాబట్టి.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం కానీ, పోస్ట్ డిలీట్ చెయ్యడం కానీ చెయ్యలేదు.. ఈ ‘ఆయుధపూజ’ పోస్ట్ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.