(Local) Mon, 20 Jan, 2020

పాదాల‌తో సల్మాన్ స్కెచ్ వేసిన వీరాభిమాని!

July 17, 2019,   5:50 PM IST
Share on:
పాదాల‌తో సల్మాన్ స్కెచ్ వేసిన వీరాభిమాని!

ప్రేక్షకులకి  సినీతారల పై  అభిమానం ఉండటం సహజంగా చూస్తూనే ఉంటాం. ఎవరికీ తోచిన విధానంలో వారు వారిపై అభిమానం చూపిస్తుంటారు. కానీ కొన్ని సార్లు వాళ్ళ చూపించే అభిమానం కేవలం సెలబ్రిటీ ని మాత్రమే కాకుండా సామాన్య జనాలని కూడా అబ్బురపరుస్తారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో ఇరాన్‌కి చెందిన దివ్యాంగురాలు వీరాభిమాని కాగా, త‌న కాలుతో స‌ల్మాన్ స్కెచ్ వేసింది. త‌న పాదాల‌తో వేసిన ఈ స్కెచ్ స‌ల్మాన్ హృద‌యాన్ని తాకింది. అభిమాని వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. దేవుడు ఆశీర్వాదంతో పాటు మ‌రింత ప్రేమని పొందుతావు అని కామెంట్ పెట్టాడు స‌ల్మాన్. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, ఈ వీడియోని ఇప్ప‌టి వ‌ర‌కు 257 వేలమంది చూసి కామెంట్లు పెడుతున్నారు. 
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.