(Local) Fri, 06 Dec, 2019

టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్

November 16, 2019,   1:25 PM IST
Share on:
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్

సువర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్ మహేష్ లుక్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు అని రావిపూడి ఒక అప్‌డేట్‌ ఇచ్చారు. మహేష్‌ ఆర్మీ లుక్ లో గన్‌తో నడిచివస్తున్న చిన్న వీడియో క్లిప్‌ను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన డైరెక్టర్ టీజర్‌ లోడింగ్‌ అంటూ ట్వీట్ చేశాడు.  అంటే త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్‌ రిలీజ్‌ కానుంది.

టీజర్ త్వరలో రాబోతోంది అన్న సంకేతంగా ‘టీజర్ లోడింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చి ఇక మోత మొదలు అంటూ ట్వీట్ చేశారు. తనదైన స్టైల్‌లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా గన్ లోడ్ చేసే విధానం అందరిని ఆకట్టుకుంటోంది.
దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో విజయశాంతి మళ్లీ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు స్టైల్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రష్మీక హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకోవడంతో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు. 

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.