(Local) Mon, 06 Jul, 2020

కోలీవుడ్ దర్శకుడితో షారుక్‌?

November 01, 2019,   5:37 PM IST
Share on:
కోలీవుడ్ దర్శకుడితో షారుక్‌?

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెలియని తమిళ్ ప్రేక్షకుడు ఉండరని తెలిసిందే....అయితే తమిళ్ ప్రేక్షుకులతో పాటు తెలుగు ప్రేక్షుకులకి కూడా కొంతవరకు ఈ దర్శకుడు సుపరిచితమే. అయితే ఈ కోలీవుడ్ హిట్ డైరెక్టర్ ఓ బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నట్టు కొంతకాలంగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్ పై ఓ  ఓ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఏనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ విషయం మీద ఇంకా హీరో షారుఖ్ నుంచి అఫీషియల్ ఏనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దాదాపు స్టోరీ డిస్కర్షన్స్ షెడ్యూల్స్ ప్లానింగ్ వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చిన షారుక్ సినిమా టైటిల్ ని కూడా వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 2న షారుక్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ఏనౌన్స్మెంట్ వెలువడనున్నట్లు టాక్ వస్తోంది. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ‘సంకీ’ అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన అట్లీ బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.