(Local) Tue, 07 Jul, 2020

రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్....

November 01, 2019,   6:33 PM IST
Share on:
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...

చిత్రసీమలో రీమేక్ ల హావ జోరు మీద నడుస్తోంది. ఇటు సినిమాలు అటు...అటు చిత్రాలు ఇటు ఎదో ఒకటి రీమేక్ కి శ్రీకరాలు చుడుతూనే ఉన్నాయి. తెలుగు అర్జున్ రెడ్డి ని హిందీ లో హీరో షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్' గా డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మరో తెలుగు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ ముచ్చట్లు కొనసాగగా.... ఇప్పుడు ఆ విషయాన్ని లుక్ తో కన్ఫర్మ్ చేసారు. ఈ రీమేక్ సినిమాను  బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ ఈ నిర్మాణంలో భాగస్వామం కానున్నారు. షాహిద్ ‘జెర్సీ’ రీమేక్ కోసం రెడీ అవుతూ తన క్యారెక్టర్ కోసం సీరియస్‌గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా షాహిద్ బ్యాట్ పట్టుకుని ఉన్న పిక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. ‘జెర్సీ రీమేక్ కోసం షాహిద్ సిద్ధమవుతున్నాడు.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, చిత్రాన్ని 2020 ఆగష్టు 28వ తేదీన విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.