(Local) Mon, 20 Sep, 2021

నగ‌దు, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సూపర్ స్టార్ అల్లుడు...

September 05, 2019,   4:14 PM IST
Share on:
నగ‌దు, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సూపర్ స్టార్ అల్ల ...

కోలీవుడ్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిన్న కూతురు సౌంద‌ర్య మళ్ళీ విశాగన్ అనే ప్ర‌ముఖ బిజినెస్‌మెన్ ని ఫిబ్ర‌వ‌రి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో రెండో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విశాగన్ ఇదివరకే ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. ఈ జంట రీసెంట్‌గా చెన్నై నుండి లండ‌న్ వెళ్ళేందుకు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వారు లండ‌న్‌లోని హెర్బ్యూ ఎయిర్ పోర్ట్‌కి చేరుకోగా, ఇమ్మిగ్రేష‌న్ స‌మ‌యంలో విశాగ‌ణ్ త‌న పాస్ పోర్ట్‌తో పాటు అమెరిక‌న్ డాల‌ర్స్‌తో కూడిన సూట్‌కేసు మిస్ అయిన‌ విష‌యాన్ని గ్ర‌హించాడు. విశాగన్ వెంట‌నే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే భారత రాయబార కార్యాలయం కూడా వెంట‌నే స్పందించి విశాగన్ కోసం డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేసిన‌ట్టు స‌మాచారం.

సంబంధిత వర్గం
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.