(Local) Sun, 31 May, 2020

"మాసు బీటే మోగిందిరా మామ" సాంగ్ తో అదరగొడుతున్న శ్రీవిష్ణు...

October 16, 2019,   1:55 PM IST
Share on:

రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో రిజ్వాన్ నిర్మాణంలో ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'తిప్పరామీసం’. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశంతో సినిమాలను చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు మళ్ళీ తెరమీదకి తిప్పరామీసం తో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు కి జంటగా నిక్కీ థంబోలి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఈ మూవీ నుండి ‘దేత్తడి పోచమ్మగుడి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ట్యూన్‌కి పూర్ణాచారి లిరిక్స్ రాయగా, సురేష్ బొబ్బిలి, నరేష్ మామిండ్ల కలిసి పాడారు. "మాసు బీటే మోగిందిరా మామ నాటు స్టెప్పే వేసెయ్యారా జోరుదారుగా ఉందామురా జరా జోరు తగ్గితే బేకారురా" అంటూ హైదరాబాది స్టైల్లో సాగింది.  సింపుల్ పదాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంది పూర్ణాచారి సాహిత్యం. ఈ మాస్ నంబర్ ఫుల్ జోష్‌తో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీకి సంబంధించి రెండు తెలగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ ‘తిప్పరామీసం’ సినిమా నవంబర్ 8న విడుదలకానుంది.
 

సంబంధిత వర్గం
రివ్యూ: జార్జిరెడ్డి
రివ్యూ: జార్జిరెడ్డి
‘తిప్పరామీసం’ నవంబర్ 8న విడుదల
‘తిప్పరామీసం’ నవంబర్ 8న విడుదల

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.