(Local) Thu, 06 May, 2021

నవంబర్ 15 న వస్తున్న 'తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌'

November 04, 2019,   2:45 PM IST
Share on:
నవంబర్ 15 న వస్తున్న 'తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌'

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జ‌వ్వాజి రామాంజ‌న‌యులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ నిర్మాణంలో యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా, హ‌న్సిక హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌` `కేసులు ఇవ్వండి ప్లీజ్‌` అనే ట్యాగ్ లైన్‌ తో జి.నాగేశ్వ‌ర రెడ్డి రూపొందుతోంది. న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. సినిమా టైటిల్ సాంగ్‌ను ఆదివారం(నవంబ‌ర్ 3) మ‌ధ్యాహ్నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి సంగ‌మేశ్వ‌ర సినిమాస్ థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ టైటిల్ సాంగ్‌ను సోష‌ల్‌మీడియాలో విడుద‌ల చేశారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.  హీరోయిన్ సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

సంబంధిత వర్గం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
వి’ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్....
వి’ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.