(Local) Sun, 19 Jan, 2020

మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

November 29, 2019,   2:48 PM IST
Share on:
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై అనిల్ సుంకర, మహేష్ బాబు  దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది.  ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు. ‘మాస్ ఎమ్‌బి మండేస్ దిస్ డిసెంబర్ 5 మండేస్ 5 సాంగ్స్ గెట్ రెడీ గయ్స్’ అంటూ డిసెంబర్ నెలలో ఉన్న అయిదు సోమవారాలలో వారానికి ఒక పాట చొప్పున రిలీజ్ చేయనున్నామని తెలిపారు. రాక్ స్టార్ డీఎస్పీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చుంటాడని మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం మెయిన్ థియేటర్ వద్ద 81 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వర్గం
మహేష్ భారీ కటౌట్!
మహేష్ భారీ కటౌట్!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.