(Local) Thu, 18 Jul, 2019

“సాండ్‌ కీ ఆంఖ్‌” టీజ‌ర్ విడుదల

July 11, 2019,   5:30 PM IST
Share on:

తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “సాండ్‌ కీ ఆంఖ్‌” అనే చిత్రం రూపొందుతుంది. తుషార్‌ హీరానందని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. “సాండ్‌ కీ ఆంఖ్‌” చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా రూపొందుతుంది. ఈ చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా, 82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. వారి స్వ‌స్థ‌లం బాగ్ ప‌ట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ కొద్ది రోజుల పాటు జ‌రిపారు. దీపావ‌ళి కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో అక్కా చెల్లెళ్ళుగా తాప్సీ, భూమి మంచి నటనను కనబరిచారు. ఈ చిత్రంతో ఆమీర్ ఖాన్ సోద‌రి నిఖాత్ ఖాన్ బాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఇందులో మ‌హారాణి పాత్ర‌లో ఆమె కనిపించ‌నుంద‌ని సమాచారం.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.