(Local) Thu, 06 May, 2021

మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మిల్కీ బ్యూటీ...

August 19, 2019,   3:39 PM IST
Share on:
మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మిల్కీ బ్యూటీ...

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేక పక్క ఇండస్ట్రీల వైపు గాలి మళ్లించిన సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో మంచి క‌థా చిత్రాలు చేసి అంద‌రి అభిమానాన్ని సంపాదించుకున్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా ఇప్పుడు మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మైంది. హార‌ర్ కామెడీ చిత్రంతో త‌మ‌న్నా మాలీవుడ్ డెబ్యూ ఇస్తుంది. ఈ చిత్రానికి సెంట్ర‌ల్ జెయిలే ప్రేత‌మ్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. సెంట్ర‌ల్ జైల్‌లో ఉండే దెయ్యం క‌థ‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో త‌మ‌న్నా మెయిన్ లీడ్ పోషిస్తుంది. ప‌లువురు మాలీవుడ్ స్టార్స్ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. సంధ్యామీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండియ‌న్ ఆర్ట్స్ స్టూడియో నిర్మిస్తుంది. త‌మ‌న్నా త్వ‌ర‌లో సైరా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో పాటు క్వీన్ రీమేక్‌గా తెర‌కెక్కిన ద‌టీజ్ మహాల‌క్ష్మీ చిత్రంతోను ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.
 

సంబంధిత వర్గం
వెబ్ సిరీస్‌లో నటించనున్న  తమన్నా
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.