(Local) Mon, 06 Jul, 2020

ఆవిడలా నటించాలని కోరిక

June 12, 2019,   2:47 PM IST
Share on:
ఆవిడలా నటించాలని కోరిక

బాలీవుడ్ లో శ్రీదేవి బయోపిక్ సినిమా గురించిన చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ రాలేదు. శ్రీదేవి మరణానంతరం 
ఆమె జీవిత చరిత్రను బయోపిక్ చిత్రీకరించి తెరకెక్కించే ఆలోచనలో ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్‌ ఉన్నట్లు వెల్లడి. ఈ విషయాన్నిగురించి మిల్కీ బ్యూటీ తమన్నాతాజాగా ఒక భేటీలో ప్రస్తావించింది. తనకు నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని,  ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని నేను శ్రీదేవి గారిని చూస్తూ పెరిగాను. ఆవిడని చూసి ఇన్స్ పేయిర్ అవుతూ ఈ దశ కి వచ్చాను. ఒకవేళ నేను ఏదైనా బయోపిక్ లో నటించాల్సి వస్తే అది కచ్చితంగా శ్రీదేవి బయోపిక్ అయి ఉండాలి.” అని ఆవిడ వవెల్లడిస్తూ అలాగే ఒక కంప్లీట్ డాన్స్ బేస్డ్ సినిమాలో కూడా నటించాలి అనుకుంటున్నాను అంటూ తన మనసులో ఉన్న ఆలోచనని బయటపెట్టింది. తాజాగా ప్రభుదేవాతో రెండోసారి నటించిన దేవి–2 చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక మూడోసారి అదే నటుడితో జత కట్టిన హిందీ చిత్రం ఖామోషి త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ఆయనతో రొమాన్స్‌ చేస్తున్నారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.