(Local) Sat, 24 Aug, 2019

ప్రముఖ తమిళ కమెడియన్ కి మాతృవియోగం!

July 18, 2019,   11:31 AM IST
Share on:

టాలీవుడ్ లో కేవలం మన తెలుగు కమెడియన్స్ మత్రమే కాకుండా,  అపుడప్పుడు త‌మిళ టాప్ కమెడియన్స్ కూడా కనిపిస్తూ కనువిందుచేస్తుంటారు. అంతేకాకుండా  తమ హాస్యంతో తెలుగు ప్రేక్షుకులకి  దగ్గరవుతుంటారు. అలాంటి ఓ కమెడియన్ వివేక్. శివాజీ, అప‌రిచితుడు వంటి అనువాద చిత్రాల‌తో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ఇదిలా ఉంటె, వివేక్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె, కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి వరకు బాగానే ఉన్న ఆమె ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆమె స్వ‌స్థ‌లం శంక‌ర‌న్ కోవిల్‌లోని పెరుంగుట్టూర్‌లో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

త‌మిళ ప్ర‌ముఖులు ఆమె మృతికి సంతాపం తెలియ‌జేస్తూ వివేక్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా, తల్లి మృతితో కొద్ది రోజుల పాటు వాటికి బ్రేక్ ఇచ్చాడు. అంతేకాక కొన్నాళ్ల క్రితం వివేక్ కొడుకు మరణించిన సంగతి తెలిసిందే.  ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమే అని చెప్పాలి. వివేక్ ను బాలచందర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  రజినీకాంత్, కమల్ హాసన్ లతో వివేక్ కు మంచి అనుబంధం ఉంది.  సూర్య సింహం సీరీస్ లో మంచి పాత్రను పోషించి మెప్పించారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.