(Local) Fri, 15 Nov, 2019

స్వీటి బర్త్ డే స్పెషల్...

November 07, 2019,   5:49 PM IST
Share on:
స్వీటి బర్త్ డే స్పెషల్...

జేజమ్మ, దేవసేన, భాగమతి ఈ పేర్లు చెప్పగానే అందరి మదిలో మెదిలే ఏకైక పేరు 'అనుష్క శెట్టి'. అతి తక్కువ సినిమాలతో టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు నవంబర్ 7న జన్మించింది. 1981లో పుట్టిన ఈ భామ‌.. ఈ ఏడాదితో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. వయసు పెరిగిన కొద్ది క్రేజ్ తగ్గని అతికొద్ది హీరోయిన్స్‌లో అనుష్క ఒకరు అనడంలో అతిశోయక్తి లేదు. అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారింది. సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తాననే ఎప్పుడు అనుకోలేదట.నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్ అంటుంది. 2005లో "సూప‌ర్" సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ క‌న్న‌డ కస్తూరి..నటన రాదని విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్ద‌గా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. 
అయితే 2009లో "అరుంధ‌తి" తో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది.  ఆ తర్వాత ‘రుద్రమదేవి’ తన రాజసాన్ని ఒలకబోసింది. జేజమ్మగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగుతో బాటు తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క స్టార్ హోదా దక్కినా ఏ మాత్రం గర్వం లేకుండా అందరితో కలిసిపోయి ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించిన హీరోయిన్ గా కూడా అనుష్క నిలిచింది. 
చిరంజీవి సరసన స్టాలిన్, బాలకృష్ణ జోడిగా ఒక్క మగాడు, వెంకటేష్ జంటగా 'నాగవల్లి', 'చింతకాయల రవి', నాగార్జున జతగా రగడ, ఊపిరి, డాన్, కింగ్, కేడి, ఢమరుకం, సోగ్గాడే చిన్నినాయన, సూపర్, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేసింది. ఇవ్వని ఒక ఎత్తు అయితే ఆమె నటించిన 'బాహుబలి' సినిమా ఒక ఎత్తు.
తెలుగు సినిమా పరిశ్రమ సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఈ సినిమాలో దేవసేనగా ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. 'సైజు జీరో' సినిమాలోని పాత్ర కోసం బరువు పెరగడం ఆమె అంకిత భావానికి నిదర్సనం. 'భాగమతి' సినిమాతో ఆమె లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రస్తుతం స్వీటీ 'నిశబ్దం' సినిమాలో నటిస్తోంది, ఆమె తన నటనతో ఎన్నో అవార్డులు గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం..!

సంబంధిత వర్గం
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.