(Local) Mon, 17 Jun, 2019

టబు తో వెంకీ రొమాన్స్!

June 10, 2019,   5:58 PM IST
Share on:

విక్టరీని వెంకటేష్, అందాల తార టబు అనగానే మనకి గుర్తు వచ్చే సినిమా 'కూలి నెంబర్ 1'. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ  చిత్రాన్ని సురేష్ సంస్థ నిర్మించింది. ఈ మూవీలో పాటలంటే ఇప్పటికీ ఇళయరాజా ఫ్యాన్స్ కు ఎవర్ గ్రీన్ నెంబర్స్. కమర్షియల్ గా మ్యూజికల్ గా  ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దాని ద్వారానే బాలీవుడ్ బ్యూటీ టబు టాలీవుడ్ కు పరిచయమయ్యింది. అయితే మ‌ళ్లీ వెంక‌టేష్‌, టబు కాంబినేష‌న్‌లో సినిమా రానేలేదు.  ప్రస్తుతం ఈ సూపర్ హిట్ జంటను మరోమారు వెండి తెరపై చూసే అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'దే దే ప్యార్ దే' చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించేందుకు సురేష్ బాబు రెడీ అవుతున్నారు. హిందీలో నటించిన టబునే హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. టబుని దే దే ప్యార్ దే రీమేక్ కోసం ఇటీవల సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి నటించబోతున్నట్లు అవుతుంది. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.