(Local) Sat, 23 Oct, 2021

విజయ్‌ సేతుపతి ఇంటిని ముట్టడించిన చిరువ్యాపారులు....

November 06, 2019,   1:42 PM IST
Share on:
విజయ్‌ సేతుపతి ఇంటిని ముట్టడించిన చిరువ్యాపారులు.. ...

సినీ స్టార్స్ కేవలం సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తుండం చూస్తూనే ఉంటాం. సెలబ్రిటీస్ వాణిజ్య ప్రకటనల్లో నటించడం వల్ల ఆ యాడ్స్ బాగా పాపులర్ అయ్యి ప్రజల్లోకి చాల తొందరగా కనెక్ట్ అవుతుంది. అయితే కొన్ని సార్లు ఈ వాణిజ్య ప్రకటనల మూలంగా సెలబ్రిటీస్ ఇబ్బందులు పడుతుంటారని తెలిసిందే. తాజాగా ఓ ఇలాంటి ఓ వాణిజ్య ప్రకటన మూలంగా ఓ హీరో కి చేదు అనుభవం ఎదురయింది.  తమిళ నటుడు విజయ్‌ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగి మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు.

ఇంతలా స్టార్‌గా మారిపోయిన విజయ్‌కి ఇటీవల చిరు వ్యాపారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారంతా ఆయన తీరును వ్యతిరేకిస్తూ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇటీవల విజయ్‌ సేతుపతి ఓ యాడ్‌లో నటించాడు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనాలంటూ అందులో కంటెంట్‌కు అనుగుణంగా చెప్పాడు. ఇది చిరు వ్యాపారులను ఆగ్రహానికి గురిచేసింది. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న విజయ్ ఇలా చేయడం వల్ల తమ చిరు వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన చేపట్టారు. అతని ఇంటిని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున బయలుదేరారు. అళ్వార్‌ తిరునగర్‌లోని అతని ఇంటి వైపు వందలాది చిరు వ్యాపారులు వచ్చారు. విజయ్‌సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అంతుకు ముందే పోలీసులు భద్రత ఏర్పాటు చేయడంతో నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. 
 

సంబంధిత వర్గం
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
కాంట్రాక్టు వ్యవసాయంపై చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
కాంట్రాక్టు వ్యవసాయంపై చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.