(Local) Mon, 21 Oct, 2019

కార్తికేయ విలన్ గానే సూట్ అవుతాడా ?

September 16, 2019,   4:06 PM IST
Share on:
కార్తికేయ విలన్ గానే సూట్ అవుతాడా ?

2017లో ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన కార్తికేయ గుమ్మకొండ, ఆ తర్వాత 2018లో RX 100 ఓ ప్రేమికుడిగా కనిపించి మంచి హిట్ అందుకున్నాడు. అయితే కార్తికేయ కెరీర్ లో హిప్పీ, గుణ 369 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. అయితే ఈ యంగ్ హీరో ఈ సరి హీరోగా కాకుండా ప్రతినాయకుడి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ దేవ్ పాత్రలో విలనిజాన్ని పండించాడు. ఈ శుక్రవారం విడుదలైన గ్యాంగ్ లీడర్ మిక్స్డ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక నాని నటన ముందు కార్తికేయ కాస్త తేలిపోయినా... స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ పరంగా కార్తికేయ చూడడానికి విలన్ షేడ్స్ లోనే కనబడతాడు. ఇక గ్యాంగ్ లీడర్ లో దేవ్ గా తన పాత్రకి న్యాయం చేసాడు కానీ... మరింతగా ఆ పాత్రలో కార్తికేయ ఇన్వాల్వ్ అయితే బావుండేది. ఇక కార్తికేయ కి నాని లాంటి హీరో దొరక్కుండా మారె హీరో దొరికినా సినిమాలో విలన్ పాత్రలో మరింతగా హైలెట్ అయ్యేవాడు. ఇక హీరోగా కన్నా కార్తికేయ విలన్ లుక్స్ కే సూట్ అయ్యాడంటున్నారు ఫాన్స్. సోషల్ మీడియాలో అయితే ఏకాంగా కార్తికేయపై హీరోగా ఎందుకు బాసు.. విలన్ అవతారమెత్తు అంటున్నారు.

సంబంధిత వర్గం
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.