(Local) Sun, 17 Nov, 2019

డిసెంబరు నాటికి రూ.42 వేలకు పసిడి!

October 29, 2019,   1:45 PM IST
Share on:
డిసెంబరు నాటికి రూ.42 వేలకు పసిడి!

బంగారం అంటే మోజుపడే మహిళలకు ఇది చేదువార్తే... మునుముందు  బంగారం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.42 వేలకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులతోపాటు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ మారకంలో రూపాయి బలహీనత వంటివి ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు.
బంగారం ధరల్లో బుల్లిష్ ట్రెండ్‌కు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్‌ రీసెర్చ్‌ కో-ఫౌండర్‌, సీఈఓ జ్ఞాన్‌శేఖర్‌ త్యాగరాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302 స్థాయిలో ఉండగా, కామెక్స్‌లో ఔన్స్‌ ధర 1,506 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధరలు 15 శాతం పెరిగినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమోడిటీ రీసెర్చ్‌) నవనీత్‌ దమానీ తెలిపారు. అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణం చల్లబడితే ధరల్లో కొంత దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని నవనీత్ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.