(Local) Tue, 14 Jul, 2020

నేటి నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న హెచ్ఏఎల్ ఉద్యోగులు

October 14, 2019,   4:39 PM IST
Share on:
నేటి నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న హెచ్ఏఎల్ ఉద్యో ...

ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కు చెందిన 20,000 మందికి పైగా ఉద్యోగులు బెంగళూరులోని ప్రధాన కార్యాలయం వద్ద ఇవాల్టి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ప్రధానంగా వేతన సవరణ డిమాండ్‌పై ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గోనున్నారు. 2017 జనవరి 1 నుంచి వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా హెచ్ఏఎల్ ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్లాలని ఆదివారం రాత్రి ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. కాగా, సమ్మె నివారించేందుకు శని, ఆదివారాల్లో చర్చలు జరిపామని, కెఫెటేరియా సిస్టం కింద అలవెన్స్ పెంచేందుకు, ఫిట్‌మెంట్ ప్రయోజనాలు 11 శాతం పెంచేందుకు అంగీకరించామని హెచ్ఏఎల్ యాజమాన్యం వెలువరించిన ఓ ప్రకటనలో పేర్కొంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.