(Local) Tue, 17 Sep, 2019

ఎయిర్ ఇండియాకు ఇంధనాన్ని ఆపనున్న చమురు సంస్థలు

August 23, 2019,   3:51 PM IST
Views: 70
Share on:
ఎయిర్ ఇండియాకు ఇంధనాన్ని ఆపనున్న చమురు సంస్థలు

కోచ్చి, పుణె, పాట్నా , రాంచి, వైజాగ్, మొహాలి విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధనాన్ని గురువారం మధ్యాహ్నం నుంచి నిలిపివేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బిపిసిఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) నిర్ణయించాయి. ఎయిర్ ఇండియాకు 90 రోజుల వరకు రుణ బకాయిలను చెల్లించడానికి వెసులుబాటు ఉంటుందని, ఈ గడువు 200 రోజులు దాటిపోయినా ఎయిర్ ఇండియా ఇప్పటివరకు ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని ఒక చమురు సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.ఏడు నెలలుగా రూ. 4500 కోట్ల పాత ఇంధన బకాయిలను చెల్లించకపోవడంతో ఆరు విమానాశ్రయాలలో ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఈ  మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి.

సంబంధిత వర్గం
టికెట్ల ధరలను తగ్గించిన ఎయిరిండియా
టికెట్ల ధరలను తగ్గించిన ఎయిరిండియా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.