(Local) Fri, 22 Nov, 2019

రూ.1,019కే ఎయిర్‌ఏషియా టిక్కెట్టు

November 05, 2019,   12:20 PM IST
Share on:
రూ.1,019కే ఎయిర్‌ఏషియా టిక్కెట్టు

చౌక విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,019గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది. ఎయిర్‌ఏషియా బిగ్ సభ్యులు సోమవారం నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ..సాధారణ ప్రజలు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది. 
వచ్చే ఏడాది ఏప్రిల్ 27 నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చునని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడుతూ..సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు, హాలీడే, పండుగ సీజన్‌లో ప్రయాణించేవారు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా లబ్దిచేకూరనున్నదన్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.