(Local) Fri, 15 Nov, 2019

రూ.పది 'కాయిన్స్‌'తో పరేషాన్‌.!

October 11, 2019,   11:52 AM IST
Share on:
రూ.పది 'కాయిన్స్‌'తో పరేషాన్‌.!

కావాల్సినంత కరెన్సీ లేకపోయినా కాయిన్స్ వచ్చాయని సంబరపడ్డారు జనం. ఎలా అయితేనేం లావాదేవీలు సాగుతున్నాయి కదా అని సర్దుకుపోయారు. కాని ఒక్కసారిగా పోటెత్తిన ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. లేనిపోని అపోహలకు కారణమవుతోంది. పదిరూపాయల కాయిన్ టెన్షన్ పెడుతోంది. పది రూపాయల నోటు కన్నాసులువుగా లావాదేవీలకు అవకాశంగా ఉన్న నాణెం ఇప్పుడు ప్రజలు, వ్యాపారుల మధ్య తగాదా పెడుతోంది. బ్యాంకు అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ నోట్లు చెల్లవని, ఈ కాయిన్స్ చెల్లవని అంటూ అప్పుడప్పుడు ప్రచారం సాగుతోంది. పది రూపాయల నాణేల చెల్లుబాటుపై ఇప్పడే కాదు.. గతంలో రచ్చ జరిగింది. అవి చెల్లవు అనే ప్రచారం కలకలం రేపింది. కొంతమంది వ్యాపారులు 10 రూపాయిల కాయిన్స్ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యవహారం ఆర్బీఐ వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన ఆర్బీఐ వర్గాలు.. క్లారిటీ ఇచ్చాయి. అవి చెల్లుబాటు కావంటూ వస్తున్న వార్తలు పుకార్లేనని స్పష్టం చేసింది.
ప్రస్తుతం 14 రకాల డిజైన్లలో రూ.10 నాణేలు చెలామణిలో ఉన్నాయని, అవన్నీ చెల్లుబాటు అవుతాయని 2018 జనవరి 17లోనే ప్రకటించింది. లావాదేవీలకు లీగల్ టెండర్ గా వీటిని కొనసాగించవచ్చని తెలిపింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రతిబింబించేలా ఎప్పటికప్పుడూ వివిధ ఫీచర్లతో రూ.10 నాణేలను ప్రవేశపెడుతున్నామని, ఇప్పటివరకూ 14 రకాల నాణేలను విడుదల చేశామని ఆర్బీఐ తెలిపింది. ఈ నాణేల చట్టబద్ధత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఈ నాణేలను స్వీకరించాలని, బ్రాంచుల దగ్గర వీటిని మార్చుకోవచ్చని తెలిపింది. ఆర్బీఐ ఇంతగా మొత్తుకుంటున్నా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.