(Local) Mon, 16 Sep, 2019

రోజుకు రూ.11కోట్ల నష్టంలో పేటీఎం

September 10, 2019,   5:30 PM IST
Views: 33
Share on:
రోజుకు రూ.11కోట్ల నష్టంలో పేటీఎం

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో అనేక డిజిటల్ పేమెంట్స్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి.  ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్ సంస్థ పేటీఎంకుఅవి గట్టి పోటినివ్వడమే కాకుండా ఆ కంపెనీకి  నష్టాలు కూడా కలిగించింది.ఇతర డిజిటల్‌ పేమెంట్స్ సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్న పేటీఎం, గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయింది. సగటున రోజుకు రూ.11కోట్ల చొప్పున నష్టపోయింది.పేటీఎం తాజాగా కంపెనీ వార్షిక ఫలితాలను వాటాదారులతో పంచుకుంది. ఈ లెక్కల ప్రకారం మార్చి 31, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.4,217కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,604కోట్ల నష్టంతో పోలిస్తే ఇది 162శాతం అధికం. ఒక్క ‘పేటీఎం మనీ’ విభాగంలోనే 36.8శాతం నష్టపోయింది. కానీ స్వల్పంగా ఆదాయం పెరిగిందని సంస్థ ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.3,309.61కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,579.67కోట్లకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో బ్రాండ్‌ విలువను పెంచుకునేందుకు ఎక్కువగా ఖర్చు చేసినట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఫలితంగా నష్టాలు వచ్చాయని తెలిపింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.