(Local) Mon, 17 Jun, 2019

ఎటిఎం ఛార్జీల్లో మార్పు - కమిటీని ఏర్పాటు చేయనున్న ఆర్‌బిఐ

June 07, 2019,   12:38 PM IST
Share on:

ఇతర బ్యాంకు ఎటిఎంలను వాడినందుకు గాను చెల్లించే ఛార్జీలు త్వరలో మారే అవకాశముంది. ఈ ఛార్జీలను సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ కమిటీకి ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ సిఇఒ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ఈ ఛార్జీలను నిర్ణయిస్తుందని, వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తన తొలి నివేదికను అందజేస్తుందని ఆర్‌బిఐ పేర్కొంది. ఒక బ్యాంకు కార్డుతో వేరే బ్యాంకుకు చెందిన ఎటిఎంలో లావాదేవీలు నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన చార్జీలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఏ బ్యాంకు కార్డుదారులైనా వేరే బ్యాంకు ఎటిఎంలలో లావాదేవీలు నిర్వహించవచ్చు, అయితే లావాదేవీల సంఖ్యపై పరిమితి ఉంది. అంతకు మించిన సంఖ్యలో లావాదేవీలు జరిపితే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలపై ఛార్జీల విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌బిఐ గురువారం ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.