(Local) Sun, 19 Jan, 2020

ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్

November 16, 2019,   12:45 PM IST
Share on:
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్

ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది. 
* ఆధార్ తో పని లేకుండా స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్ శాఖలో స్వీయ ప్రకటన ఇస్తే సరిపోతుంది.
*ఆధార్‌లో తమ స్వస్థలం చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుత చిరునామాతో బ్యాంకు ఖాతా ప్రారంభించాలనుకునేవారికి ఈ నిర్ణయం సహాయపడుతుంది.
*చాలా మందికి ఆధార్‌లో ఒక చిరునామా ఉంటే ప్రస్తుతం ఉంటున్న చిరునామా మరొకటి ఉంటుంది. ఆధార్ కోసం తమ స్వస్థలం చిరునామా ఇచ్చి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడేవారికి కేవైసీ సమయంలో ఇది సమస్యగా మారింది. అయితే ఇప్పుడు కేంద్రం ఆధార్ కు సంబంధించి కీలక సవరణ చేసింది. 
*ఆధార్ సంఖ్యనే ఐడీ ఫ్రూఫ్ గా ఉపయోగించి కేవైసీ కోసం మీరు ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి చిరునామా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 
* కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.