(Local) Mon, 16 Sep, 2019

ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ డ్రా

September 07, 2019,   2:00 PM IST
Views: 49
Share on:
ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ డ్రా

ఏటీఎం కార్డు లేకుండా డబ్బు తీసుకోలేం. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తన ఏటీఎంలలో కార్డు లేకుండా ఖాతాదారులు డబ్బు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎంలలో UPI QR సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ లో బ్యాంకు UPI ని ఉపయోగించి ATM స్క్రీన్ పై వచ్చే QR కోడ్ ను స్కాన్ చేసి డబ్బును డ్రా చేసుకోవచ్చు. గరిష్టంగా 2 వేల రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవచ్చు. దీని ద్వారా లావాదేవీల్లో భద్రత పెరగనుంది. ప్రస్తుతం ఈ విధానం ముంబై, ఢిల్లీ,చెన్నై నగరాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. మరో ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు.

సంబంధిత వర్గం
నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై
నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై
ముంబయిలో మూడు మెట్రో రైలు మార్గాలకు మోడి శంకుస్థాప ...
ముంబయిలో మూడు మెట్రో రైలు మార్గాలకు మోడి శంకుస్థాప ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.