(Local) Thu, 18 Jul, 2019

డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక నిర్ణయం

July 09, 2019,   11:51 AM IST
Share on:

అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిడి కొనసాగుతుండటంతో రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. వీటిని అధిగమించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్కడి మార్కెట్లో విలువ ఆధారిత ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నూతన మార్కెట్లోకి ప్రవేశించడం కొనసాగుతున్నదని, చైనా, రష్యా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రెడ్డీస్‌ చైర్మన్‌ కే సతీష్‌ రెడ్డి వార్షిక నివేదికలో వెల్లడించారు. అమెరికా మార్కెట్లోకి విడుదల చేయడానికి 110 జనరిక్‌ ఔషధాల యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి కోసం వేచి చూస్తున్నాయని, వీటిలో పలు కీలక ఔషధాలు ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.