(Local) Wed, 16 Oct, 2019

రూపాయికే స్పీకర్... రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్... ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్

October 02, 2019,   2:32 PM IST
Share on:
రూపాయికే స్పీకర్... రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్... ఫ్ ...

ఒక్క రూపాయికే స్పీకర్. సోనీ హెడ్‌ఫోన్ ధర రూ.9. ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర రూ.19. సాంసంగ్ మొబైల్ ధర రూ.29. ఈ ధరలు చూసి షాకయ్యారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లు ఇవీ అంటూ వాట్సప్‌లో ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. అందులో ధరలు చూసి అంతా షాకవుతున్నారు. రూ.19 ధరకే స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా అని అవాక్కవుతున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. అవి నిజమైన ఆఫర్లు కాదు. మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి కేటుగాళ్లు సృష్టించిన మెసేజ్ అది. అందులో ఉన్న లింక్స్ క్లిక్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ పోలినట్టుగా ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో పేజ్ డిజైన్, ఫోటోలు అన్నీ ఫ్లిప్‌కార్ట్‌ అసలు వెబ్‌సైట్‌ను పోలినట్టుగానే ఉంటాయి. కాబట్టి యూజర్లు సులువుగా మోసపోయే అవకాశముంది.

ఇక ఆ నకిలీ సైట్‌లో ఆఫర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. నమ్మలేని ఆఫర్లు ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు నిజమని నమ్మి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త. ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే మీ లాగిన్ డీటైల్స్ ఏవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్ మాత్రమే అడుగుతుంది. మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ లింక్ 10 మందికి షేర్ చేయాలన్న మెసేజ్ కనిపిస్తుంది. మీరు మెసేజ్ షేర్ చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుందనుకుంటే పొరపాటే.

అక్కడితో ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. మళ్లీ మొదటి నుంచి ఆర్డర్ చేయాలి. ఇలా మీరు ఎన్నిసార్లు చేసినా ఆర్డర్ ప్లేస్ కాదు. దాంతో ఇది నకిలీ వెబ్‌సైట్ అని అర్థమవుతుంది. వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెంచుకోవడానికి, క్లిక్స్ సంపాదించడానికి కొందరు మోసగాళ్లు రూపొందించిన వెబ్‌సైట్ ఇది. ఈ మెసేజ్ నమ్మారంటే మీరు టైమ్ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు.

సంబంధిత వర్గం
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ డికౌంట ...
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ డికౌంట ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.