(Local) Wed, 16 Oct, 2019

జీఎస్టీపై ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్

October 02, 2019,   4:17 PM IST
Share on:
జీఎస్టీపై ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్

ఆర్ధిక మాంద్యం సెగ జీఎస్టీ వసూళ్లను కూడా తాకింది. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్టానికి పడిపోయాయి. దీని ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం 91,916కోట్లు మాత్రమే. గత రెండు నెలల నుండి రూ.1లక్ష కోట్ల కంటే తక్కువగా నమోదవడం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తర్వాత ద్రవ్య లోటు మరింత పెరిగింది. ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోవడంతో ఇది పెను ప్రభావం చూపనుంది. ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితులతో 2019-20 సంవత్సరానికి భారత్ నిర్దేశించుకున్న 3.3శాతం ద్రవ్య లోటు కట్టడిని చేరుకోవడం కష్టమేనని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.