(Local) Sun, 17 Nov, 2019

ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు

November 06, 2019,   2:08 PM IST
Share on:
ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు

ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేస్తున్నట్లు తన బడ్జెట్‌ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల అదనపు మూలధన వనరులు కేటాయిస్తామన్నారు. శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలను వెల్లడిస్తూ ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకులో ఖాతా  కలిగిన ఖాతాదారు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుసేవలను అందుకునేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మొండి బకాయిలతో సతమతం ఆవుతున్న బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయన్నారు. ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులను రుణసంక్షోభం నుంచి గట్టెక్కించామని, వాణిజ్యబ్యాంకుల్లో రూ.లక్షకోట్లమేర నిరర్ధకాస్తులు తగ్గాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండిబకాయిలు క్రమేపీ తగ్గుతున్నాయని ఆమెతెలిపారు. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను పటిష్టంచేసి మెరుగైన  పనితీరుకనబరిచే ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకింగ్‌, మూచువల్‌ఫండ్స్‌నుంచి సహకారం అందేలా చూస్తామని చెప్పారు. అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణ,పర్యవేక్షణ బాధ్యతలను రిజర్వుబ్యాంకు పరిధిలోనికి తీసుకువస్తున్నట్లు ఆర్దిక మంత్రి వెల్లడించారు. ఇక విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసభారతీయులు ఎవరు ఉన్నా వారి పాస్‌పోర్టు ఆధారంగా వారికి ఆధార్‌కార్డులు సైతం మంజూరవుతాయని ఆర్ధిక మంత్రి భరోసా ఇచ్చారు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.