(Local) Sat, 18 Jan, 2020

దిగొస్తున్న బంగారం,వెండి ధరలు

September 10, 2019,   12:30 PM IST
Share on:
దిగొస్తున్న బంగారం,వెండి ధరలు

పసిడి ప్రియలకు ఉరటనిస్తూ భారీగా తగ్గుతుంది బంగారం ధర.  డిమాండ్‌ లేమి,రూపాయి బలపడటం తదితర కారణాలతో  వీటి ధరలు దిగొస్తున్నాయి.సోమవారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ. 39,225 పలికింది. అటు వెంట కూడా నేడు  బంగారం దారిలోనే  పయనించింది. పారిశ్రామిక వర్గాలు,నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 1400 తగ్గి రూ.49వేల దిగువకు పడిపోయింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 48,500గాఉంది. అధిక ధరల కారణంగా గత కొంతకాలంగా రిటైల్‌ మార్కెట్లో బంగారం విక్రయాలు తగ్గాయి. దీంతో ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోయింది. అటు దేశీయ కరెన్సీ రూపాయి పుంజుకోవడం కూడా ఈ లోహాలధరల తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పసిడిధరకు రెక్కలొచ్చి రూ. 40వేల పైన జీవనకాల గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.