(Local) Mon, 16 Sep, 2019

తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

September 07, 2019,   1:07 PM IST
Views: 48
Share on:
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా  గణనీయంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్, నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1 శాతం తగ్గింది.  దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.38,527కు పడిపోయింది. గతవారం రోజుల్లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి ధరకు(రూ.39,885) పెరిగింది. ఇప్పుడు బంగారం ధర రూ.1,000 మేర పడిపోయింది. పసిడి బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర 3 శాతం తగ్గడంతో రూ.48,065కు పడిపోయింది. ఇటీవలి గరిష్ట స్థాయి రూ.51,489తో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ,3,500 పడిపోయింది. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.39,278కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ లో ఔన్స్ బంగారం 1510 డాలర్లు పలికింది. వెండి ధర కూడా తగ్గి ఔన్స్ 18.30 డాలర్లు ఉంది.

సంబంధిత వర్గం
బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.