(Local) Fri, 24 Jan, 2020

కామధేను ఆయోగ్ స్టార్టప్ కంపెనీలకు శుభవార్త

September 10, 2019,   12:34 PM IST
Share on:
కామధేను ఆయోగ్ స్టార్టప్ కంపెనీలకు శుభవార్త

గుజరాత్ లోని గాంధీనగర్ లోని పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభ్ కతీరియా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవు పేడ, మూత్రంతో ఉత్పత్తుల తయారీ గురించి చర్చించారు. ఈ సమావేశంలో దేశంలో ఆవు పేడ, మూత్రంతో ఉత్పత్తులను తయారు చేసే రాష్ట్రీయ కామధేను ఆయోగ్ స్టార్టప్ కంపెనీలకు నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్త చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామధేను ఆయోగ్ స్టార్టప్ కంపెనీలకు 60 శాతం ప్రారంభ పెట్టుబడిని ప్రభుత్వం అందజేస్తుందని వల్లభ్ కతీరియా వెల్లడించారు. ఆవు పాలు, నెయ్యి విక్రయంతో పాటు వాటి అనుబంధ ఉత్పత్తులైన మూత్రం, పేడలను ఔషధాల తయారీ, వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుగా స్టార్టప్ కంపెనీలు పెట్టే యువతను తాము ప్రోత్సహిస్తామని వల్లభ్ చెప్పారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.