(Local) Fri, 15 Nov, 2019

ఉద్యోగుల యేడాది పనికే గ్రాట్యుటీ

November 02, 2019,   12:22 PM IST
Share on:
ఉద్యోగుల యేడాది పనికే గ్రాట్యుటీ

సాధారణంగా ఒక ఉద్యోగి అయిదేళ్ల ఉద్యోగ జీవితం పూర్తయ్యాక మొత్తం సర్వీసు కాలానికి ఏడాదికి 15 రోజుల చొప్పున గ్రాట్యుటీ ఇస్తారు. బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఏడాదికే ఇస్తానంటున్నది. మొత్తం సర్వీసు కాలానికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఇటీవలే డిఎ పెంచి దీపావళి కానుకగా అందించిన కేంద్రం ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో మరింత సంతోషాన్ని నిపించింది. ఇందువల్ల ఏ కారణంగానైనా సంస్థలో మానేసినా, మరో సంస్థలో చేరినా ఉద్యోగులకు ఎంతో నష్టం జరిగేది. ఇకపై ఆ సమస్య ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రాట్యుటీ అంశంపై సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం కేంద్రం విడుదల చేయలేదు.

సంబంధిత వర్గం
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.