(Local) Fri, 15 Nov, 2019

రెండో త్రైమాసికంలో అంచనాలను అందుకున్న ఐటి దిగ్గజం

October 12, 2019,   3:16 PM IST
Share on:
రెండో త్రైమాసికంలో అంచనాలను అందుకున్న ఐటి దిగ్గజం

దేశంలో రెండవ అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.4,037 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,110 కోట్లతో పోలిస్తే ఇప్పుడు నికర లాభం 1.7 శాతం మేర తగ్గినప్పటికీ గత త్రైమాసికంతో పోలిస్తే పెరగడం గమనార్హం. అంతేకాదు కంపెనీ లాభాలు మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టి వెళ్లడాన్ని తగ్గించడం కోసం ఉద్యోగులపై చేసేఖర్చు పెరగడమే నికర లాభాలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల ప్రయోజనాల కోసం కంపెనీ చేసే ఖర్చు 13.6 శాతం మేర పెరిగింది. కంపెనీ తీసుకున్న చర్యల కారణంగా ఒకప్పుడు 23.4 శాతం మేర ఉండిన ఉద్యోగులు కంపెనీని వదిలిపెట్టి వెళ్లడం ఇప్పుడు 21.7 శాతానికి తగ్గింది. కాగా కంపెనీ ఈ ఆర్థిక పంవత్సరానికి రెవిన్యూ రాబడి అంచనాను సైతం గతంలో అంచనా వేసిన 8.510 శాతంనుంచి 910 శాతానికి పెంచింది. కంపెనీ రాబడిలో కీలకమైన డిజిటల్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 38.4 శాతం పెరగడంతో కంపెనీకి దీని ద్వారా వచ్చే రాబడి సైతం రూ. 1.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరో వైపు కంపెనీ ప్రధాన వ్యాపారం 0.7 శాతం తగ్గడంతో దీనిద్వారా వచ్చే రాబడి 1.98 బిలియన్ డాలర్లుగా ఉంది.

రెవిన్యూ వృద్ధి, డిజిటల్ వ్యాపారం వృద్ధి, నిర్వహణ లాభాలు, నిర్వహణ సామర్థాలు, భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టి వెళ్లడం తగ్గడం .. ఇలా అనేక కోణాల్లో మా కంపెనీ పని తీరు మెరుగుపడింది. క్లయింట్లకు సేవ అందించడమే లక్షంగాను, మా వాటాదారులకు గరిష్ఠంగా విలును అందించడమనే మా ప్రయాణంలో మేము పురోగతి సాధిస్తున్నామనడానికి ఇవన్నీ సంకేతాలు’ అని శుక్రవారం విలేఖరుల సమావేశంలో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఇన్ఫోసిస్ ఎండి, సిఇఓ శైలేష్ పరేఖ్ చెప్పారు. కాగా ఈ త్రైమాసికంలో కొత్తగా7,457 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని, దీంతో కంపెనీలో మొత్త ఉద్యోగుల సంఖ్య 2,36,486కు చేరుకుందని పరేఖ్ చెప్పారు. అయితే అమెరికా చూనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ పరిణామాలు లాంటివి కంపెనీ పని తీరుపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని కూడా ఆయన చెప్పారు.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.