(Local) Fri, 22 Nov, 2019

ఐపీఓలో దూసుకువెళ్ళ్తున్న ఐఆర్సీటీసీ

October 14, 2019,   2:56 PM IST
Share on:
ఐపీఓలో దూసుకువెళ్ళ్తున్న ఐఆర్సీటీసీ

ఐపీఓకు వచ్చి నిధులను సమీకరించుకున్న రైల్వే ఆన్ లైన్ టికెటింగ్, టూరిజం కేటరింగ్ కంపెనీ IRCTC , నేడు స్టాక్ మార్కెట్ లో తొలి రోజు లిస్టింగ్ అయింది. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సంస్థ ఈక్విటీ విలువ అదరగొట్టే రేంజ్ లో దూసుకెళ్లింది. రూ. 320 ఇష్యూ ప్రైస్ కాగా, ఏకంగా 101 శాతం లాభపడి రూ. 644కు చేరింది. NSE లో రూ. 95. శాతం పెరిగింది. దీంతో ఐఆర్సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగంగా, IRCTC లో వాటాలను విక్రయించి రూ. 645 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఐపీఓకు వచ్చిన నాలుగో రైల్వేలకు చెందిన సంస్థగా IRCTC నిలిచింది. గతంలో RITES, రైల్ వికాస్ నిగమ్, IRCON లు ఐపీఓలకు వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.