(Local) Fri, 19 Jul, 2019

ఐటిసి ఛైర్మన్‌ వైసి దేవేశ్వర్‌ మృతి

May 11, 2019,   12:19 PM IST
Share on:

ఐటిసి ఛైర్మన్‌ వైసి దేవేశ్వర్‌(72) శనివారం ఉదయం కన్నుమూశారు. 2011లో ఆయన పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఐటిసిని ఒక ఎఫెఎంసిజిగా మలచిన ఘనత దేవేశ్వర్‌కే దక్కుతుంది. 2017 వరకు ఆయన ఐటిసికి సిఈఓగా కూడా పనిచేశారు. 2018 జనవరిలో ఐటిసి ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. 
దేవేశ్వర్‌ 1968లో ఐటిసిలో చేరారు. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరారు. ఆయన నేతృత్వంలో కంపెనీ బాట్‌ నుంచి టేకోవర్‌ ముప్పును విజయవంతంగా తప్పించుకుంది. అనంతరం ఎఫ్‌ఎంసిజి రంగంలోకి దిగి విజయవంతంగా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఐటిసి ఆదాయం రూ. 5200 కోట్ల నుంచి రూ 51,000 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.