(Local) Fri, 22 Nov, 2019

మెట్టు దిగివచ్చిన జియో

October 13, 2019,   1:08 PM IST
Share on:
మెట్టు దిగివచ్చిన  జియో

ఇంత కాలం వరకు యూజర్లకు ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చిన జియో ఇప్పుడు బాధడం మొదలుపెట్టింది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు నిమిషానికి ఆరు పైసల చొప్పున కట్ చేస్తామని, దీనికి ప్రత్యేకించి టాప్‌ ఆప్ రీచార్జీ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 10 నుంచి ఇది అమలులోకి వచ్చింది.  ఈ విషయం తెలిసి చాలా మంది సోషల్ మీడియాలో జియో తీరుపై విమర్శలు చేశారు. దీంతో ఓ మెట్టు దిగివచ్చిన ఆ సంస్థ తన యూజర్లకు కాస్త ఊరట కలిగించే మాటను చెప్పింది.

అక్టోబర్ 9, అంత కంటే ముందు రీచార్జీ చేసుకున్న వినియోగదారులకు కాస్త బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునేందుకు వీరి నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. వారి గడవు ముగిసే వరకు కూడా ఉచిత సేవలనే కొనసాగిస్తారు. తర్వాత నుంచి యథావిధిగా కొత్త నిబంధనలు అమలు చేస్తామని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అంటే ప్రస్తుత గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత మాత్రం చార్జీలు చెల్లించక తప్పదన్నమాట. 

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.