(Local) Mon, 17 Jun, 2019

పదిశాతంక్షణించిన రిలయన్స్‌ షేర్లు

May 10, 2019,   10:31 AM IST
Share on:

బిలియనీర్‌ పారిశ్రామికవేత్త ముకేష్‌ అంబానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌షేర్లు గడచిన నాలుగు సెషన్లలో పదిశాతం క్షీణించాయి. దీనివల్ల మార్కెట్‌ విలువల్లో సుమారు పది బిలియన్‌ డాలర్లు దిగజారినట్లయింది. మోర్గాన్‌ స్టేన్లీ రేటింగ్‌సంస్థ రిల్‌ స్టాక్‌ గ్రేడింగ్‌ తగ్గించి సమాంతర స్థాయిని కేటాయించింది. జియో ప్రారంభించిన తర్వాత రిలయన్స్‌ రుణం కూడా పెరుగుతూ వస్తోంది. ఎక్కువ మూలధన వ్యయం కావాల్సిరండంతో రుణభారం విధిగా పెరిగింది. ఉదయం పూట ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేర్లు 1272.30 చొప్పున ట్రేడ్‌ అయింది. అంతకుముందు ముగింపుకంటే 2.09 శాతం క్షీణించింది. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌సూచీ 0.48శాతం క్షీణించి 37,608.14 పాయింట్లకు చేరింది. ఈనెల 3వ తేదీనుంచి రిలయన్స్‌ పదిశాతం క్షీణించి మార్కెట్‌ విలువల్లో వెయ్యికోట్ల డాలర్లమేర క్షీణించిందని చెప్పాలి. ట్రేడ్‌వార్‌ ఉత్కంఠతో గడచిన ఏడురోజులుగా భారత ఈక్విటీ మార్కెట్లుసైతం అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.