(Local) Fri, 24 Jan, 2020

బంగారంపై వస్తున్న ఆ వార్తలన్నీ ఊహాగానాలే..

November 01, 2019,   12:55 PM IST
Share on:
బంగారంపై వస్తున్న ఆ వార్తలన్నీ ఊహాగానాలే..

పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్రం ఓ సరికొత్త పథకం తీసుకురానున్నట్లు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. త్వరలోనే కేంద్రం దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే దీనిపై వస్తున్న వార్తలను ఆర్థికశాఖ వర్గాలు కొట్టిపారేశాయి. బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని సంబంధిత అధికారులు వివరించారు. కొంతమంది తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకుంటున్నారని... అలాంటి వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం సూచించే ఓ నిర్ణీత పరిమాణానికి మంచి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని రూపొందిస్తారని కథనాలు వచ్చాయి. పరిమితికిమించి బంగారం ఉన్నవారు దానిని బయటపెట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి ఆలోచన ఏదీ ప్రస్తుతం కేంద్రానికి లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.