(Local) Mon, 17 Jun, 2019

వచ్చే నెల నుండి ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలు ఉండవు - ఆర్బీఐ

June 12, 2019,   2:21 PM IST
Share on:

ఆర్‌బీఐ  కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ ద్వారా జరిపే ఆన్‌లైన్ నగదు లావాదేవీలపై ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. భారీ మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఉపయోగించే ఈ రెండు విధానాల్లోనూ వచ్చే నెల 1 నుంచి ఉచితంగా లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొంది. ఇప్పటివరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు ఆర్‌బీఐ కనీస రుసుము వసూలు చేస్తోంది. దానితో ఆ భారాన్ని బ్యాంకులు తమపై వేసుకోకుండా ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని రిజర్వు బ్యాంకు ఎత్తివేడయంతో ఖాతాదారులపై భారం తగ్గనుంది. జూలై 1 నుంచి ఖాతాదారుల నుంచి ఈ రుసుములు వసూలు చేయవద్దని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, నగదు చలామణి తగ్గించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వంటి వాటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు తెలిపింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.