(Local) Thu, 18 Jul, 2019

పంజాబ్ నేషనల్ బ్యాంకు కు .. మరోసంస్థ టోకరా

July 07, 2019,   1:07 PM IST
Share on:

పంజాబ్ నేషనల్ బ్యాంకును ఇప్పుడు మరో సంస్థ భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ రు. 3,800 కోట్ల మేర మోసగించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో ఈ విషయాన్ని PNB వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి కి కూడా తెలిపింది.పంజాబ్ నేషనల్ బ్యాంకు చండీగఢ్ లోని కార్పొరేట్ బ్రాంచ్ ద్వారా దాదాపు రూ. 3,200 కోట్లు, దుబాయ్ లోని బ్రాంచ్ ద్వారా రూ. 345 కోట్లు, హాంగ్ కాంగ్ బ్రాంచ్ ద్వారా రూ. 268 కోట్లను ఇచ్చినట్టు వెల్లడించింది. గత వారంలో భూషన్ స్టీల్ ప్రమోటర్లు, ఆడిటర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లపై ఢిల్లీలోని ఓ కోర్టుకు 70వేల పేజీల నివేదికను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అందజేసింది. భూషన్ స్టీల్ పై సీబీఐ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.